ఐతే స్కూళ్లు ఓపెన్ చేసిన వారం రోజులకే విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
2/ 6
ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులోని డీఆర్ఎం మున్సిపల్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు టీచర్లు, ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. (ప్రతీకాత్మకచిత్రం)
3/ 6
మరికొందరు ఉపాధ్యాయులు, విద్యార్థులకు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో తోటి ఉపాధ్యాయులు, విద్యార్థు ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
4/ 6
ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలోని ఓ పాఠశాలలో ఐదుగురు స్టూడెంట్స్ కు వైరస్ సోకింది. (ప్రతీకాత్మకచిత్రం)
5/ 6
శ్రీకాళహస్తి రూరల్ మండలం, కాపుగున్నేరి పంచాయతీ పరిధిలోని ఎంఎంసీ కండ్రిగలోని ప్రాధమిక పాఠశాలల్లో ఐదుగురు విద్యార్థినులకు కొవిడ్ సోకింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
6/ 6
పాఠశాలలు తెరిచిన వారం రోజుల్లోనే పిల్లలకు వైరస్ సోకడంతో ప్రభుత్వం మరింత దృష్టిపెట్టాల్సిన అవసరముందని తల్లిదండ్రులు కోరుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)