Ammvodi: సీఎం జగన్ (CM Jagan) మానసపుత్రిక.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న అమ్మఒడి (Jagananna Ammavodi) పథకం అత్యంత ముఖ్యమైనది. రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు ప్రతి ఏటా 15 వేల రూపాయల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది ప్రభుత్వం. అమ్మఒడి మూడో విడుత పథకాన్ని విడుదల చేయడానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఒకవేళ ఎవరికైనా ఒకటి కన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే ఎన్పీసీఐ మ్యాప్ అయిన ఖాతాలో మాత్రమే నగదు పడుతుంది. బ్యాంకుకి వెళ్లి ఎంపీటీసీ మ్యాప్ చేసుకోల్సి ఉంటుంది. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో తల్లి, విద్యార్థి ఓకే మ్యాపింగ్‌లో ఉండాలి. వివరాలు వాలంటీర్ వద్ద ఉండే యాప్‌తో సరి చూసుకోవాల్సి ఉంటుంది. అందులో వివరాలు తప్పుగా ఉంటే వాలంటీర్ యాప్ హెచ్ హెచ్ మ్యాపింగ్ ద్వారా ఈకేవైసీ అప్ డేట్ చేసి.. సరిచేయాల్సి ఉంటుంది.