Brahmanandam: బ్రహ్మానందం అరుదైన ఘనత.. ఏ నటుడికీ దక్కని గౌరవం సొంతం..

టాలీవుడ్ (Tollywood) హాస్య బ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam). ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు ప్రేక్షకుల మొహాల్లో నవ్వులు పూస్తాయి. సినిమాల్లో ఏ నటుడికీ సాధ్యంకాని విధంగా గిన్నిస్ బుక్ రికార్డును (Guinness Book of world Record) కూడా సొంతం చేసుకున్నారాయన. అలాగే ఎన్నో పురస్కారాలు హాస్యబ్రహ్మను వరించాయి.