మంచి భోజనం కావాలంటే వంద రూపాయల పైనే ఖర్చవుతుంది.అంత పెట్టినా రుచికరమైన భోజనం దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు.అటువంటిది కేవలం ఎనభై రూపాయలకే బాస్మతి రైస్ తో చేసిన ఘుమఘుమలాడే నేతి బిర్యానీ దొరుకుతుందంటే ఇక జనం ఊరుకుంటారా...
భోజన ప్రియులు.. ఎక్కడైనా మంచి ఫుడ్ దొరుకుతుందంటే.. చాలు అక్కడికి ఎగబడి వెళ్తారు. మంచి ఫుడ్ కోసం సెర్చ్ చేస్తుంటారు. అలాంటిది... తక్కువ ధరకే నోరూరించే ఫుడ్ దొరుకుతుందని ఇంకా వదులుతారా ? అక్కడకు పరుగులు తీస్తారు.
2/ 7
ఈ రోజుల్లో మంచి భోజనం కావాలంటే వంద రూపాయల పైనే ఖర్చవుతుంది.అంత పెట్టినా రుచికరమైన భోజనం దొరుకుతుందన్న గ్యారెంటీ లేదు. అటువంటిది కేవలం ఎనభై రూపాయలకే బాస్మతి రైస్ తో చేసిన ఘుమఘుమలాడే నేతి బిర్యానీ దొరుకుతుందంటే ఇక జనం ఊరుకుంటారా...ఆ హోటల్ ముందు క్యూలు కట్టి మరీ ఆరగించి వెళుతున్నారు.
3/ 7
పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఉన్న బిలాల్ బిర్యానీ పాయింట్ గురించేనండోయ్ మీకు చెప్పేది.అక్కడ బిర్యానీతో పాటుగా రకరకాల చికెన్, నాన్ వెజ్ వెరైటీలు.. కూడా ఉంటాయి.
4/ 7
బిర్యానీతో పాటుగా చికెన్ కర్రీ,చికెన్ ఫ్రై,చికెన్ ధమ్,మచట్ ఫ్రై,మటన్ ధమ్ ,మటన్ కర్రీ,లివర్ ప్రై,తలకాయ కూర,నాటుకోడి,బోటీ,లెగ్ పీస్,చేపలు,రొయ్యల వేపుళ్ళు తో పాటు దాదాపు 25 రకాలకు పైగా వంటకాలు వడ్డించ టానికి సిద్ధంగా ఉంటాయి.
5/ 7
హోటల్ స్థాపించిన తొలినాళ్ళలో బిర్యాని విత్ చికెన్ ఐటమ్స్ కేవలం వంద రూపాయలకే అందించిన నిర్వాహకులు ఆ తర్వాత పెరిగిపోతున్న నిత్యవసర సరకుల ధరలు,అద్దెలు,జీతాల భారం పెరగడంతో స్వల్పంగా రేట్లు పెంచారు.
6/ 7
పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళ లేని సామాన్య ప్రజలకు సైతం మంచి నాణ్యమైన మరియు రుచికరమైన ఆహారం వేడి వేడిగా అందించడమే తమ లక్ష్యం అంటున్నారు నిర్వాహకులు.
7/ 7
రేపటి నుండి రంజాన్ పవిత్ర మాసం ప్రారంభం సందర్భంగా హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా తీసుకు వచ్చిన వంట మాస్టర్ల చే హలీమ్ ను కూడా అందుబాటులో ఉంటుందండోయ్.