వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలోని ఓ మండలానికి చెందిన వ్యక్తి ఈ ఏడాది జూన్ లో తన భార్య, కుమార్తెకు కరోనా సోకడంతో గుంటూరు జీజీహెచ్ కు తీసుకొచ్చాడు. ఐతే భార్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆ తర్వాత 13 ఏళ్ల కూతురుతో కలిసి స్వగ్రామానికి చేరుకున్నాడు. బాలికకు అనారోగ్యంగా ఉండటంతో అదే గ్రామానికి చెందిన మహిళ నాటు వైద్యం చేయిస్తానని నమ్మించి తీసుకెళ్లింది. (ప్రతీకాత్మకచిత్రం)
కేసులో మొత్తం 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 10 మంది వ్యభిచార ముఠా నిర్వహాకులు. ఈ కేసులో మరికొంతమంది నిందితులున్నారని త్వరలో వారిని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఐతే కేసులో ప్రధాన నిందితురాలైన మహిళ ఓ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించినట్లు ప్రచారం జరుగుతోంది. (నిందితులతో పోలీసులు)