ఆశ పేరుతో 1961లో సోవియట్ యూనియన్‌లోని నికోలావ్ లో అది ప్రస్తుతం ఉక్రెయిన్ ఉంది.. ఐఎన్ఎస్ రాజ్‌పుత్ నిర్మాణాన్ని చేపట్టారు. 1977, సెప్టెంబర్ 17న సేవలు ప్రారంభించగా.. 1980, మే 4న తేదీన జార్జియాలోని యూఎస్ఎస్ఆర్లో భారత రాయబారి ఐ.కె.గుజ్రాల్ సమక్షంలో ఐఎన్ఎస్ రాజ్‌పుత్‌గా పేరు మార్చి.. భారత నావికాదళంలోకి ప్రవేశపెట్టి... జాతికి అంకితం చేశారు. అప్పటి నుంచి భారత సముద్ర జలాల్లో తిరుగులేని శక్తిగా మారింది. మొట్టమొదటి గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్గా 41 ఏళ్ల పాటు రాజ్‌పుత్ సుదీర్ఘ సేవలందించింది.
భారత దేశాన్ని అనుక్షణ సురక్షితంగా ఉంచే లక్ష్యంతో ఐఎన్ఎస్ రాజ్‌పుత్ అనేక కార్యకలాపాల్లో పాల్గొంది. ఐపీకేఎఫ్‌కు సహాయంగా ఆపరేషన్ అమన్, శ్రీలంక తీరంలో పెట్రోలింగ్ విధుల కోసం ఆపరేషన్ పవన్, మాల్దీవుల బందీ పరిస్థితులను పరిష్కరించేందుకు అపరేషన్ కాక్టస్, లక్షద్వీప్‌కు చెందిన క్రోవ్‌నెస్ట్ ఆపరేషన్‌లో రాజ్‌పుత్ పాల్గొంది.
భారత నౌకాదళానికి విరామం లేని సేవలను అందించిన.. రాజ్‌పుత్‌కు ఘనంగా వీడ్కోలు పలకను న్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. విశాఖలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగే ఈ వీడ్కోలు కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనల ప్రకారం అతి తక్కువ మంది సమక్షంలో నిర్వహించనున్నారు. సూర్యాస్తమయ సమయంలో భారత నావికాదళం నుంచి ఐఎన్ఎస్ రాజ్‌పుత్ నిష్క్రమించనుంది. రాజ్‌పుత్‌లో విధులు నిర్వర్తించిన పలువురు అధికారుల్ని సత్కరించేందుకు తూర్పు నౌకాదళం ఏర్పాట్లు పూర్తి చేసింది.