ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య పీఆర్సీ వార్ (PRC Issue) కంటిన్యూ అవుతోంది. అటు ఉద్యోగులు.. ఇటు ప్రభుత్వం ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఉద్యోగులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నా, సమ్మె నోటీసులిచ్చినా ప్రభుత్వం మాత్రం పీఆర్సీ విషయంలో ముందుకే వెళ్తోంది. (సీఎం జగన్ ఫైల్ ఫోటో)
ఇప్పటికే ప్రభుత్వం రెండుసార్లు జనవరికి సంబంధించి ఫిబ్రవరిలో చెల్లించాల్సిన జీతాలు, పెన్షన్లకు సంబంధించిన బిల్లులు ప్రాసెస్ చేయాలని రెండుసార్లు ఆదేశాలిచ్చినా ఉద్యోగులు మాత్రం ససేమిరా అన్నారు. కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు ప్రాసెస్ చేయలేమని, తమను ఇబ్బంది పెట్టొద్దంటూ ట్రెజరీ, పే అండ్ ఎకౌంట్స్ ఉద్యోగులు ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇంత జరుగుతున్నా పీఆర్సీ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. ఓ వైపు చర్చలకు రావాలని చెబుతూనే.. జీతాలకు సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్తోంది. తాజాగా జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్ చేయాలని మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు ట్రెజరీ అదికారులు, డీడీఓలకు మరోసారి సర్క్యులర్ ఇచ్చింది. ఇందులో బిల్లులు ప్రాసెస్ విధానాన్ని కూడా వివరించింది.(ప్రతీకాత్మకచిత్రం)
అయితే మంత్రులు మాత్రం.., చర్చకు రావాల్సిందే అని పట్టు పడుతున్నారు. వినతి పత్రాలు ఇచ్చి సమస్య పరిష్కరించమంటే ఎలా అని ప్రశ్నిస్తోంది. అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వచ్చి.. చర్చలు జరిపితే.. పీఆర్సీ విషయంలో ఉన్న సమస్యలను వివిస్తామని.. చర్చల ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం అవుతుందని మంత్రులు చెబుతున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)