కొత్త ఏడాది వస్తుందంటే క్యాలెండర్ తో పాటు ప్రభుత్వ నిబంధనలు, పలు కీలక అంశాల్లో మార్పులు వస్తుంటాయి. పన్నురేట్లలో కూడా ప్రభుత్వాలు మార్పులు తీసుకొస్తాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనాల లైఫ్ ట్యాక్స్ లో మార్పులు చేసింది. జనవరి 1 నుంచి కొత్త పన్నులు అమల్లోకి రానున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
రూ.50 వేలు అంతకన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేసే బైకులకు గతంలో 9శాతం ఉండగా ఇప్పుడు అది 12శాతానికి చేరుకుంది. అలాగే రెండేళ్ల నుంచి 11ఏళ్లు దాటిన వాహనాలను ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రంలోకి తీసుకొస్తే.. వాహనం జీవితకాలాన్ని బట్టి 11 శాతం నుంచి 4శాతం వరకు లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)