AP Employees Strike: పీఆర్సీపై తగ్గేదేలేదంటున్న ఉద్యోగులు.. సమ్మెకు డేట్ ఫిక్స్..
AP Employees Strike: పీఆర్సీపై తగ్గేదేలేదంటున్న ఉద్యోగులు.. సమ్మెకు డేట్ ఫిక్స్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె (Government Employees Strike) సైరన్ మోగించనున్నారు. పీఆర్సీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు.. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మరింత ఉద్యమించాలని తీర్మానించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె సైరన్ మోగించనున్నారు. పీఆర్సీపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు.. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మరింత ఉద్యమించాలని తీర్మానించారు. ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక నిర్ణయం మేరకు సమ్మె చేయాలని నిర్ణయించాయి.
2/ 6
ఈ మేరకు శుక్రవారం భేటీ అయిన ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసులు, సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి సమ్మెతేదీలపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం సీఎస్ కు సమ్మె నోటీసులు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.
3/ 6
ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను కూడా ఉద్యోగ సంఘాలు ఖరారు చేశాయి. ఈనెల 25న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేయపట్టాలని నిర్ణయించాయి. అలాగే వచ్చేనెల 3వ తేదీన చలో విజయవాడ.. ఫిబ్రవరి 7 లేదా 8వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి.
4/ 6
ఓవైపు రాష్ట్ర కేబినెట్ సమావేశం కొనసాగుతుండగానే ఉద్యగ సంఘాలు ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయడం చర్చనీయాంశమైంది. పీఆర్సీ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. జీతాలు పెంచుతారనుకుంటే తగ్గించేలా పీఆర్సీ ఇచ్చారని ఆరోపిస్తున్నాయి.
5/ 6
ఇదిలా ఉంటే ఉద్యోగల ఉద్యమం నేపథ్యంలో వచ్చే నెల జీతాలు పడతాయా లేదా అనేది సందిగ్ధంలో పడింది. కొత్త పీఆర్సీ జీవో ప్రకారం జీతాల బిల్లులు ప్రాసెస్ చేయలేమని.. తమను ఇబ్బంది పెట్టొద్దని స్పష్టం చేశాయి. కొత్త సాఫ్ట్ వేర్ ఇన్ స్టలేషన్ కు కూడా ఉద్యోగులు అంగీకరించకపోవడంతో జీతాలపై క్లారిటీ రావడం లేదు.
6/ 6
ఓ వైపు ఉద్యోగుల ఆందోళన కొనసాగుతుండగానే నూతన పీఆర్సీకి, ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుకు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్రవేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తమ కార్యాచరణను ఎలా ముందుకు తీసుకెళ్లబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.