Srisailam Dam: పర్యాటకులకు పండగే.. నేడు శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత

Srisailam Dam: ఆకు పచ్చటి ప్రకృతి.. ఎత్తైన కొండలు లోయలు.. కృష్ణా నది సోయగాలు.. భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయం.. శ్రీశైలం పర్యటనలో మన చూసే అద్భుతమైన దృశ్యాలు ఇవి. వీటికి తోడు డ్యామ్ గేట్లు తెరిస్తే ఆ జలదృశ్యం కలిగించే అనుభూతులు జీవితాంతం గుర్తుంటాయి. ఎప్పటిలాగే ఆ సమయం రానే వచ్చింది. ఇవాళే శ్రీశైలం గేట్లను ఎత్తనున్నారు.