GT Hemanth Kumar, Tirupathi, News18. Tirumala Tirupati Devastanam: ఇల వైకుంఠం.. ఆధ్యాత్మిక క్షేత్రం.. కోట్లాది హిందువుల ఆరాధ్య దైవంగా వెలసిన దివ్య క్షేత్రం తిరుమల.. అక్కడ వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని.. ఒక్కసారి దర్శించుకుంటే చాలు.. సకల పాపాలు పోతాయన్ని భక్తుల నమ్మకం. అందుకే సీజిన్ తో సంబంధం లేకుండా వేలాదిగా భక్తులు పోటెత్తుతున్నారు.
సామాన్య భక్తులకు గదుల కేటాయింపు సులభతరం చేసే విధంగా సెంట్రల్ రిసెప్షన్ కార్యాలయాన్ని తిరుపతికి తరలించే అంశంపై చర్చించారు. గదులు తిరుపతిలో ఎన్రోల్ చేసుకోవడంద్వారా.. తిరుమలకి వెళ్లేలోపే గదుల కేటాయింపు సాధ్యం అవుతుంది. అలా తిరుమలకి చేరుకున్న భక్తుడు నేరుగా గదులలోకి వెళ్లి విశ్రాంతి తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. దింతో సామాన్య భక్తుడు సులభంగా గదులు పొందవచ్చని టీటీడీ భావిస్తుంది.