GT Hemanth Kumar, Tirupathi, News18. Tirumala Tirupati Devasthanam: కలియుగ వైకుంఠం తిరుమలలో.. శ్రీవారి సన్నిధికి వెళ్లాలని.. ఆ స్వామిని మనసారా చూడాలని కొన్ని కోట్ల మంది భక్తులు కోరుకుంటున్నారు. అయితే కరోనా తిరుమల దర్శనాలపై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో రోజువారి దర్శనాల సంఖ్యలో భారీగా కోత పడింది. దానికి తోడు.. కేవలం ఆన్ లైన్ లో మాత్రమే టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.
తాజాగా ఫిబ్రవరి నెలకు సంబంధి ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను శుక్రవారం తిరుమల తిరుపత దేవస్థానం విడుదల చేసింది. రోజుకు 12 వేల చొప్పున.. మొత్తం 3 లక్షల 36 వేల టికెట్లను అందుబాటులో ఉంచితే.. కేవలం 45 నిమిషాల్లోనే ఆ టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.. ప్రత్యేక దర్శనం టికెట్లకే ఇంత డిమాండ్ ఉంటే.. ఇక సర్వదర్శనం టికెట్లకు ఇంకెంత డిమాండ్ ఉంటుందో ఊహించవచ్చు.
రేపు అంటే శనివారం ఉదయం.. తొమ్మిది గంటలకు ఆన్ లైన్ లో సర్వదర్శన టికెట్లను అందుబాటులో ఉంచనుంది టీటీడీ.. రోజుకు పదివేల చొప్పున టికెట్లను భక్తులు బుక్ చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది.. మొదట ఫిబ్రవరి నెల మొత్తానికి సర్వదర్శన టికెట్లను అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు.. కానీ ఇప్పుడు నిర్ణయం మార్చుకుంది టీటీడీ.