తాజా పథకం ద్వారా 1220 రైతు గ్రూపులకు వైఎస్ఆర్ యంత్రసేవా పథకం కింద 29.51 కోట్ల లబ్ధి చేకూరనుంది. ఇన్పుట్ సబ్సిడీ, యంత్ర సేవా పథకం కలిపి మొత్తం 564.28 కోట్లు పంపిణీ చేయనున్నారు. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ.1,612 కోట్ల సాయం అందించారు.