ఇక భారీ బడ్జెట్ సినిమాల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హీరో, డైరెక్టర్ రెమ్యూనరేషన్ కాకుండా.. రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు రేట్లు పెంచుకునే వెలుసుబాటు కల్పించింది. కనీసం పది రోజుల పాటు రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చిన ప్రభుత్వం.., కనీసం 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన సినిమాలకు మాత్రమే రేట్లు పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది.