ఈ నేపథ్యంలో టెన్త్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షలు రాసే విద్యార్థులకు ఫ్రీ జర్నీ ఆఫర్ ఇచ్చింది. విద్యార్థులకు వారు నివాసముండే ప్రాంతం నుంచి ఎగ్జామ్ సెంటర్ వరకు ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణించవచ్చు. అలాగే పరీక్ష ముగిసిన తర్వాత ఇంటికి తిరిగొచ్చేందుకు కూడా ఫ్రీగానే బస్సు ఎక్కవచ్చు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇదిలా ఉంటే విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదో తరగతి పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం, ఫర్నిచర్ ఏర్పాట్లు తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టూడెంట్స్ కు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. (ప్రతీకాత్మకచిత్రం)