Ap: విద్యార్థులకు శుభవార్త..'జగనన్న విదేశీ విద్యాదీవెన' నిధులు విడుదల
Ap: విద్యార్థులకు శుభవార్త..'జగనన్న విదేశీ విద్యాదీవెన' నిధులు విడుదల
'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకానికి సంబంధించి నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు విదేశీ విద్య అభ్యసించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్ర చరిత్రలో జగనన్న విదేశీ విద్యా దీవెన సువర్ణ అధ్యాయమని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ మేరకు బటన్ నొక్కి నిధులను విడుదల చేశారు.
'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకానికి సంబంధించి నిధులను ఏపీ సీఎం జగన్ (Cm Jagan)విడుదల చేశారు. రాష్ట్రంలో పేద విద్యార్థులు విదేశీ విద్య అభ్యసించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు.
2/ 8
రాష్ట్ర చరిత్రలో జగనన్న విదేశీ విద్యా దీవెన సువర్ణ అధ్యాయమని సీఎం జగన్ (Cm Jagan) పేర్కొన్నారు. ఈ మేరకు బటన్ నొక్కి నిధులను సీఎం విడుదల చేశారు.
3/ 8
ఈ పథకం ద్వారా ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలందరికి వరల్డ్ టాప్ యూనివర్సిటీలో చదుకునేలా వీలుంటుందని సీఎం అన్నారు.
4/ 8
'జగనన్న విదేశీ విద్యా దీవెన' పథకం కింద ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో టాప్ 200 వర్సిటీల్లో 213 మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
5/ 8
వారందరి చదువు కోసం మొదటి విడతలో సాయంగా రూ.19.95 కోట్లను సీఎం జగన్ (Cm Jagan) ఇవాళ విడుదల చేశారు.
6/ 8
ప్రతిభ ఉండి పెద్ద యూనివర్సిటీలో చదువుకోవాలనుకునే వారి కోసం ఈ పథకం ఉపయోగపడుతుంది. ప్రపంచ వేదికపై దేశం, రాష్ట్రం జెండా ఎగరాలని సీఎం అన్నారు. పిల్లలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి చదువేనని నేను నమ్ముతున్నానన్నారు.
7/ 8
మంచి యూనివర్సిటీలో సీటు వస్తే డబ్బులు కట్టలేక చదువుకొని వారు ఎవరు ఉండకూడదు. పారదర్శకమైన పద్దతిలో బెస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీలు, కాలేజీలను గుర్తించామని ఏపీ సీఎం జగన్ తెలిపారు.
8/ 8
గతంలో ఉన్న పథకాలను అధ్యయనం చేశాం. కానీ అవన్నీ పేరుకే ఉన్నాయి. ఎస్సి, ఎస్టీలకు రూ.15 లక్షలు, మిగతా వారికి రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చే పరిస్థితి గతంలో ఉంది. దీనితో విద్యార్థుల అవసరం తీరదు. ఆ తాపత్రయం నుంచే ఈ ఆలోచన పుట్టిందని సీఎం తెలిపారు.