ఇక నుంచి శ్రీవారి సుప్రభాత సేవ, తోమాల సేవ, అర్చన, కల్యాణోత్సవం, డోలోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ వంటి ప్రత్యేకమైన ఆర్జిత సేవల్లో కోటా ప్రకారం టోకెన్లు పొందిన భక్తులు పాల్గొనవచ్చు. పాలకమండలి సమావేశంలో ఆర్జిత సేవల టికెట్ల ధరలను పెంచాలని టీటీడీ భావించింది. కేవలం సిఫార్సు లేఖలపై వచ్చే భక్తులకు మాత్రమే ధరలు పెంచాలనే యోచనలో ఉన్నట్లు టీటీడీ తెలిపింది.