ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సాధారణంగా సున్నపురాయి, ఐరన్ వోర్, బాక్సైట్ వంటి ఖనిజాలు లభ్యమయ్యే గనులు మాత్రమే ఉన్నాయి. బంగారు గనులున్నట్లు (Gold Mines) గతంలో ప్రచారం జరిగినా ఆయా ప్రాంతాల్లో వెలికి తీసిన సందర్భాలు లేవు. ఐతే తాజాగా ఏపీలో బంగారు నిక్షేపాలున్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, మాసాయి పేట కొండల్లో బంగారం, రాగి, తెల్లారాయి వంటి విలువైన ఖనిజాలున్నట్లు గుర్తించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొండపై డ్రిల్లింగ్ చేసి కెమెరాలతో సెర్చ్ చేస్తున్నారు అధికారులు. కొండపై 500 నుంచి 1000 అడుగుల మేర తవ్వకాలు జరిపారు. రెండువేల హెక్టార్లకి పైగా భూముల్లో బంగారం, రాగి, తెల్లరాయి ఉన్నట్లు గుర్తించారు.
ఇదిలా ఉంటే గతంలో కడప జిల్లా ఉప్పరపల్లెలలో వజ్రాల గనులున్నట్లు వెల్లడైంది. గత ఏడాది డిసెంబర్లో వజ్రాల వేటకు టెండర్లు పిలిచేందుకు మైనింగ్ శాఖ ఏర్పాట్లు చేసింది. కానీ ఆ తర్వాత దీనిపై స్పష్టత రాలేదు. ఉప్పరపల్లె ప్రాంతంలో వజ్రాల గనులున్నట్లు గతంలో జియోగ్రాఫికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. సంబంధిత నివేదికను రాష్ట్రప్రభుత్వానికి కూడా ఇచ్చింది. (ప్రతీకాత్మకచిత్రం)
దీంతో ఉప్పరపల్లెలో వజ్రాల మైనింగ్ కు లైన్ క్లియర్ అయింది. నిజానికి మైనింగ్ శాఖ గతంలోనే అక్కడ వజ్రాల లభ్యత ఉన్నట్లు గుర్తించింది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఆంక్షలు, వజ్రాల వెలికితీత కష్టతరం కావడంతో భారీగా ఖఱ్చయ్యే అవకాశముండటంతో పెద్దగా పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేయడంతో వజ్రాల వెలికితీసేందుకు మరింత అవకాశం ఏర్పడింది. (ప్రతీకాత్మకచిత్రం)
వజ్రాల కోసం లోతుగా అన్వేషించేందుకు టెండర్లు పిలవడానికి రంగం సిద్ధం చేసింది. ఈ గనికి వేలం నిర్వించి కాంపోజిట్ లీజ్ ఇవ్వనున్నారు. లీజుకు తీసుకున్న సంస్థల వెంటనే మైనింగ్ చేసుకునే వీలు మాత్రం ఉండదు. ఆ బ్లాకుల్లో వజ్రాలు ఎక్కడున్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవడానికి సొంతగా జీ-3, జీ-2, జీ-1 సర్వేలు చేయించుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఈ సర్వేల కోసం రెండు నుంచి ఐదేళ్ల పాటు అవకాశమిస్తారు. ఆ తర్వాత ఈలీజును సాధారణ లీజుగా మారుస్తారు. కడప జిల్లా ఉప్పరపల్లె ప్రాంతంలో మొత్తం 37.65 చదరపు కిలోమీటర్ల మేర వజ్రాల గనులున్నట్లు అంచనా వేస్తున్నారు. లీజుల కేటాయించిన అనంతరం సదరు సంస్థలు.. పూర్తిస్థాయిలో సర్వే చేస్తే వజ్రాల లభ్యతపై క్లారిటీ వచ్చే అవకాశముంది. (ప్రతీకాత్మకచిత్రం)