ఎలాంటి కష్టం లేకుండా వంట అయిపోవడంతో.. రేట్లు పెరుగుతున్నా గ్యాస్ సిలిండర్లతోనే వంటకు ఎక్కుమంది ప్రధాన్యం ఇస్తున్నారు. అయితే వంట గ్యాస్ వినియోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. లేదంటే ప్రమాదాలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టాలు పెరుగుతాయి అంటున్నారు.
ముఖ్యంగా గ్యాస్ వినియోగదారులు ఈ విషయాలను తెలుసుకోవాల్సి ఉంది. వంట గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేసే బాయ్స్ వెంట తప్పని సరిగా స్ప్రింగ్ త్రాసు ఉండాలనే నిబంధన ఉంది. గృహవసర సిలిండర్ లో నికరంగా గ్యాస్ 14.200 కేజీలు, సిలిండర్ బరువు 15.300 కేజీలు కలుపుకుని మొత్తంగా 29.500 కేజీలు ఉండాలి. మీకు సరఫరా చేస్తున్న సిలిండర్ బరువు తక్కువగా ఉన్నట్లు అనుమానం వస్తే తక్షణమే తూకం వేయించాలి. తూకం వేసేందుకు డెలివరీ బాయ్స్ నిరాకరిస్తే వెంటనే జిల్లా సరఫరా అధికారికి తప్పకుండా ఫిర్యాదు చేయాలి..
గ్యాస్ సిలిండర్ నాణ్యత కూడా అవసరం. గ్యాస్ సిలిండర్ల నాణ్యతకు సంబంధించి నిర్వహించే రీ క్యాలిబ్రేషన్ పరీక్ష మూడు దశల్లో ఉంటుంది. ముందుగా విజువల్ ఇన్స్పెక్షన్ చేస్తారు. ఇందులో సిలిండర్ పనికి రాదని తేలితే దాన్ని ధ్వంసం చేయాల్సి ఉంటుంది. లేకపోతే హైడ్రాలిక్ పరీక్షలకు పంపుతారు. అక్కడ సిలిండర్లలో నీటిని నింపి 5 సార్లు ఫ్రెషర్ ద్వారా లీకేజీలను గుర్తిస్తారు. ఆ తర్వాత వాలు పరిస్థితిని గమనించి నిమాటి ఫ్రెషర్ పరీక్ష చేస్తారు. సిలిండర్లలో గాలి నింపి ఒత్తిడిని పెంచుతారు. అన్ని పరీక్షల్లో సిలిండర్ మంచిదని తేలితే దానిని ప్రజా వినియోగానికి అనుమతిస్తారు. ఈ పరీక్షను ఏడాదిలో 4 సార్లు నిర్వహించాలి.
ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో సిలిండర్‌ను తొలగించడానికి వీలైనంత స్థలముండాలి. స్టౌవ్ పైభాగంలో అలమరాలు ఎట్టి పరిస్థిల్లో ఉండకూడా చూసుకోవాలి. అలాగే ఒకరి గ్యాస్ సిలిండర్‌ను.. ఇతరులకు ఇవ్వడం శ్రేయస్కారం ఏ మాత్రం కాదు. గ్యాస్ స్టౌకు సంబంధించిన మరమ్మతులను డీలర్ వద్దగానీ, అనుభవం కలిగిన మెకానిక్ వద్దగానీ చేయించాలి. అంతే కానీ వ్యక్తిగత ప్రయోగాలు చేయోద్దు.
కంపెనీల నిర్లక్ష్యం కూడా కారణం..
ఎల్పీజీ సిలిండర్ల వాడకంలో వినియోగదారుల మాట అటుంచితే కొన్ని చమురు సంస్థలు తమ కేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నాయి. కాలం చెల్లిన సిలిండర్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. వినియోగంలో దెబ్బతిన్న సిలిండర్లను మార్చడం లేదా, వాటికి మరమ్మతు లు చేయడంలో కంపెనీలు పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయి.
ఎస్బీఐ ఛార్జీలు, ఈపీఎఫ్ ఆధార్ లింకింగ్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర, పెన్షనర్స్ జీవన్ ప్రమాణ పత్రం, ప్రత్యేక రైళ్లు" width="875" height="583" /> వాస్తవానికి గ్యాస్ సిలిండర్లకు 7 సంవత్సరాల జీవిత కాలం నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇది పూర్తయితే వాటిని రీ క్యాలీబ్రెషన్ పరీక్షకు పంపాల్సి ఉంటుంది. అన్ని బాగా ఉన్నాయి అనుకున్న తరువాత దానిని మరో 5 సంవత్సరాల పాటు వినియోగించుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
ప్రమాదాన్ని ముందే పసిగడితే ఇలా చేయాలి..
గ్యాస్ నుంచి వాసన వస్తున్నట్టు అనిపిస్తే తక్షణమే రెగ్యులేటర్, తర్వాత స్టౌవ్ ఓపెన్‌ను ఆఫ్ చేయాలి. విద్యుత్ బోర్డులో స్విచ్‌లు వేయడం లేదా తాకడం లాంటివి అస్సలు చేయకూడదు. అన్ని కిటికీలు, తలుపులు తెరిచి ఉంచాలి. రెగ్యులేటర్‌ను వేరుచేసి సిలిండర్‌పైన సేఫ్టీ కప్ పెట్టి సురక్షిత ప్రదేశంలో ఉంచాలి. గ్యాస్ లీకవుతున్నట్టు భావిస్తే ప్రమాదాల నివారణకు దగ్గరలోని అగి్నమాపక కేంద్రాలు, డీలర్లకు ఫోన్ చేయాలి.
వినియోగదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
గ్యాస్ సిలిండర్ నాబ్కి కంపెనీ సీల్ వేసి పంపుతుంది. అలా సీల్ వేసినవే తీసుకోవాలి. సీల్ బిగుతా లేకుండా ఊడిపోయినట్లు ఉంటే తిరస్కరించాలి. సిలిండర్‌ను ఎప్పుడూ నిలువుగానే ఉంచాలి. పడుకోబెట్టడం.. పక్కకు వంచి ఉంచడం చేయరాదు. గ్యాస్ సిలిండర్‌ను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ ఉండాలి.
వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ కట్టేయాలి. లీకేజీ సమస్య రాకూడదంటే రెగ్యులేటర్ కట్టేసిన తర్వాత స్టౌపై మంటను అలాగే ఉంచి పరిశీలించాలి. దీని వల్ల ట్యూబులో ఉండే గ్యాస్ పూర్తిగా బయటకు వచ్చి మండిపోతుంది. సిలిండర్ వినియోగించని సందర్భంలో ప్లాస్టిక్ మూత పెట్టేయాలి. ఖాళీదైనా ఇలాగే చేయాలి. గ్యాస్ స్టౌని ఎప్పుడూ సిలిండర్ కన్నా ఎత్తులోనే ఉంచాలి. రెగ్యులేటర్‌కు మరో ట్యూబ్‌ను కలిపి మరో స్టౌకు జత చేయరాదు.
సిలిండర్‌పై నంబర్లు పరిశీలించాలి..
రీ–క్యాలీబ్రెషన్ పరీక్షకు సంబంధించి ప్రతి సిలిండర్‌పై భాగాన ఉన్న సపోర్టుల్లో ఏదో ఒక దానిపై లోపలి వైపున ఎబీసీడీల అక్షరాలతో ఒక కోడ్‌తో పాటు రెండు నంబర్లు సంవత్సరానికి సంబంధింనవి సూచిస్తారు. జనవరి నుంచి మార్చి వరకు–ఎ, ఏప్రిల్ నుంచి జూన్ వరకు–బి, జూలై నుంచి సెప్టెంబర్ వరకు –సి, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు –డి కోడ్‌ను కేటాయించారు. ఉదాహరణకు సిలిండర్‌పై డి–20 అని ఉంటే డిసెంబర్ 2020లో ఆ సిలిండర్ జీవిత కాలం పూర్తవుతుందని అర్థం. ఈ విషయంలో గృహిణులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
సీల్ లేకుండా డెలివరీ వద్దు
గ్యాస్ సిలిండర్ డెలివరీలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి సిలిండర్‌కు తప్పని సరిగా సీల్ ఉంటుంది. సీల్ లేకుండా ఇచ్చే సిలిండర్లను ఎవరూ తీసుకోవద్దు. సీల్ లేకుండా డెలివరీ చేస్తే డెలివరీ బాయ్స్‌పై, గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటాం. డెలివరీ బాయ్స్ అంతా తమ వెంట తూనిక యంత్రం అందుబాటులో ఉంచుకోవాలి. వినియోగదారులు ఎవరైనా అడిగితే సిలిండర్ తూకం వేసి చూపించాలి. వినియోగదారుడి సమక్షంలో గ్యాస్ బాయ్‌లు సీల్ తీసి వాల్వు తనిఖీ చేయాలి.