ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ జరుగుతోంది. ఓటు వేసేందుకు చలిని కూడా లెక్క చేయకుండా ప్రజలు వస్తున్నారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు జరగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్ ఎంపిక ఉంటుంది. నాలుగో విడత 13 జిల్లాలలో 161 మండలాలలోని 3, 299 పంచాయతీలకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 553 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 2,744 గ్రామాల్లో పోలింగ్ జరుగుతోంది మొత్తం 7,475 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు., మొత్తం 33,435 వార్డుల్లో 10,921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 22,422 వార్డులకు 49,083 మంది పోటీలో ఉన్నారు. 16 రెవెన్యూ డివిజన్లలో మొత్తం 67, 75,226 మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28,995 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇందులో 6,047 సమస్యాత్మక, 4,967 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు.