మరణం ఎప్పుడు.. ఎలా.. ఎటువైపు నుంచి వస్తుందో ఊహించడం కష్టం. రెప్పపాటులో ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటాయి. అది ప్రమాదం కావొచ్చు. ఇంకేదైనా కావొచ్చు. అప్పటివరకు బాగానేఉన్నవారు అంతలోనే విగతజీవులుగా కనిపిస్తారు. విధి ఆడే వింత నాటకంలో ఎవరైనా పాత్రధారులు కావాల్సిందే.
2/ 6
అప్పటివరకు సరదా కబుర్లు చెప్పుకుంటున్న నలుగురిపైకి ఊహించని విధంగా మృత్యువు దూసుకొచ్చింది. రెప్పపాటులో నాలుగు ప్రాణాలను తీసుకెళ్లిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం మద్దిమడుగులో ఘోరం జరిగింది.
3/ 6
రోడ్డుపక్కనే ఉన్న ఇంట్లో నలుగురు గడప వద్ద మంచంపై కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో అతివేగంగా దూసుకొచ్చిన బొలెరో వాహనం వారిని ఢీ కొట్టింది. ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయారు.
4/ 6
మృతులు కొండయ్య, మహాలక్ష్మి, అమ్ములు, దేవిగా గుర్తించారు. స్థానికులిచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని బయటకు తీశారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం కడప రిమ్స్ కు తరలించారు.
5/ 6
అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు నిర్ధారించారు. బొలేరో వాహనంలో ఉన్నవారికి గాయలు కాగా వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
6/ 6
మరోవైపు అప్పటివరకు బాగానే ఉన్నవారు ఉన్నట్లుండి మృత్యువాత పడడంతో వారు బంధువులు, చుట్టుపక్కల వాళ్లు శోకసంద్రంలో మునిగిపోయారు.