ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మరోసారి వరదలు (Floods) విజృంభిస్తున్నాయి. గత నెలలో గోదావరి వరదలు ముంచెత్తగా ఈసారి కృష్ణానది (Krishna River) ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి ఇన్ ఫ్లో భారీగా పెరిగింది. కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల పూర్తిగా నిండాయి.