Home » photogallery » andhra-pradesh » FIVE TELUGU DESAM PARTY LEADERS WERE INJURED IN SRILANKAN BLASTS

Photos : శ్రీలంక పేలుళ్లలో గాయపడ్డ ఐదుగురు టీడీపీ సభ్యులు

శ్రీలంకలో జరిగిన పేలుళ్లలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంకి చెందిన ఐదుగురు టీడీపీ సభ్యులు గాయపడ్డారు. ఇందులో కాంట్రాక్టర్ సురేంద్ర బాబు కూడా ఉన్నారు. పేలుళ్లు జరిగిన ప్రదేశానికి సమీపంలోనే ఉండటంతో వీరు గాయపడినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది. కాగా, శ్రీలంకలో పేలుళ్ల గురించి ప్రభుత్వానికి ముందే సమాచారం ఉందని ప్రధానమంత్రి విక్రమ్‌సింఘే ధ్రువీకరించారు. అయితే పేలుళ్లను అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడంలో విఫలయమయ్యామని అన్నారు. తమకు అందుతున్న సమాచారం ప్రకారం.. పేలుళ్లకు పాల్పడ్డ నిందితులు స్థానికులే అని చెప్పారు.