ఆంధ్రప్రదేశ్... బాపట్ల జిల్లా.. మేదరమెట్ల హైవేలో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ.. కారును ఢీకొట్టడంతో.. ఐదుగురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా అద్దంకి ఎస్సై సమందర్ వలి కుటుంబ సభ్యులని తెలిసింది.
2/ 7
అద్దంకి ఎస్సై, ఆయన కుటుంబ సభ్యులు చినగంజాం లోని శివరాత్రి మహోత్సవాలలో పాల్గొనేందుకు శనివారం రాత్రి చినగంజాం చేరుకున్నారు. ఎస్సై సమందర్ వలి.. చినగంజాంలో విధుల్లో ఉండగా... కుటుంబ సభ్యులు మాత్రం ఆదివారం తెల్లవారుజామున కారులో తిరుగు ప్రయాణంలో.. అద్దంకికి బయలుదేరారు.
3/ 7
ఈ క్రమంలో కారు మేదరమెట్ల దగ్గరకు రాగానే డివైడర్ను ఢీకొంది. వెంటనే కారు అదుపుతప్పింది. ఆ సమయంలో అదే మార్గంలో వస్తున్న లారీ.. కారును ఢీకొంది.
4/ 7
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న అద్దంకి ఎస్సై సమందర్ వలి భార్య, కూతురు, డ్రైవర్, మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
5/ 7
సమాచారం అందుకున్న అద్దంకి సీఐ రోశయ్య, పోలీసులూ.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకొని.. కారులో నుంచి మృతదేహాలను బయటకు తీశారు.
6/ 7
మృతుల వివరాల్ని అద్దంకి సీఐ రోశయ్య, మేదరమెట్ల ఎస్ఐ శివకుమార్ ప్రకటించారు. ఎస్సై సమందర్ వలి సతీమణి షేక్ వాహిదా వలి (38), కూతురు అయేషా హుమేరా వలి (9), గుర్రాల జయశ్రీ (50), గుర్రాల దివ్యతేజ (29), కమ్మిడి వీర బ్రహ్మాచారి(22) మృతి చెందారని తెలిపారు.
7/ 7
అతివేగం, చీకట్లో ప్రయాణం.. ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదం స్థానికంగా అందర్నీ కలచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన వారంతా చనిపోయారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.