తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓ మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా.. అతడికి దాదాపు 30కిలోల బరువున్న కచ్చిడి చేప చిక్కింది. దీనిని గోల్డెన్ ఫిష్ గా పిలుస్తుంటారు. ఎందుకంటే దీని ఖరీదు బంగారంతో పోటీపడుతుంటుంది. ఈ చేపను ఓ వ్యాపారి ఏకంగా రూ.4 లక్షలు ఇచ్చి దక్కించుకున్నాడు. ఈ నెల మొదట్లో ఓచేప చిక్కగా దాని ధర నాలుగున్నర లక్షలు పలికింది. (ప్రతీకాత్మకచిత్రం)