First night Specail Sweet Halwa: స్వీటులందు ఈ స్పీటు వెరీ స్పెషలయా అనొచ్చు.. ముఖ్యంగా తొలిరాత్రికి తప్పకుండా ఉండాల్సిన స్వీట్ అని చాలామంది నమ్మకం.. ఎందుకుంటే లైంగిక సామర్ధ్యాన్ని పెంపొందిస్తుందన్నది ఎన్నోసార్లు రుజువైంది.. అందుకే పడగ గదిలో ఎన్ని స్వీట్లు పెట్టినా.. ఆ స్వీట్ లేకపోతే.. ఆ ఫీల్ లేదంటారు ఆ రుచి గురించి తెలిసిన పెద్దలు.. అసలు దానిక అంత సామర్థ్యం ఎలా వచ్చిందో తెలుసా..?
ఆంధ్రా స్పెషల్ స్వీట్లు ఎన్ని ఉన్నా.. అదులో మాడుగుల హల్వాది ప్రత్యేక గుర్తింపు. దాదాపు ఒకటిన్నర శతాబ్దాలైనా ఈ స్వీట్ కు క్రేజ్ తగ్గలేదు.. రోజు రోజుకూ పెరుగుతోంది. విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలి సారి తయారు చేసే హల్వా కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. మాడుగుల వాసులు తయారు చేసే ఈ రకమైన హల్వా కు లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉందని అంతర్జాతీయంగా కూడా ప్రచారం జరిగింది.
విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే ఆ హల్వాకు ఆ పేరొచ్చింది. 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి దీనిని తయారు చేశారు. ఇప్పుడు మాడుగుల నుంచి సుమారు 20కి పైగా దేశాలకు ఈ హల్వా ఎగుమతి అవుతోంది అంటే దీని స్పెషాలిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే మాడుగుల హల్వా ఒక సాధారణ స్వీట్ మాత్రమే. కొన్ని ప్రయోగాలు చేసి మొదట బూడిద గుమ్మడి, కర్బూజ, కొబ్బరికాయలతో చేసేవారు. తరువాత గోధుమ పాలు, ఆవు నెయ్యి, జీడిపప్పు, పంచదారతో హల్వాని తయారు చేశారు. అంతకుముందు చేసిన హల్వా కంటే దీని రుచి బాగుండటంతో అమ్మకాలు బాగా పెరిగాయి.
హల్వా వ్యాపారంలో బాగా పోటీ ఉండటంతో మరో కొత్త స్వీట్‌ని తయారు చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఆ కొత్త స్వీటే... ఇప్పుడు అందరితో లొట్టలు వేయిస్తున్న మాడుగుల హల్వా. తరువాత మాడుగుల హల్వా పేరు ఊరు దాటి జిల్లా స్థాయికి చేరింది. తరువాత రాష్ట్ర స్తాయికి.. ఇప్పుడు ఏంక అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం మన రాష్ట్రంలో చాలా రకాల హల్వాలు దొరుకుతాయి.. కానీ మాడుగుల హల్వా అందులో చాలా ప్రత్యేకం. ఎందుకంటే మాడుగుల హల్వా తయారు చేయడానికి నాలుగు రోజుల సమయం పడుతుంది. ముందుగా మేలు రకం గోధుమలు మూడు రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు తీస్తారు. వాటిని ఒక రోజు పులియబెట్టి...ఆవు నెయ్యి, పంచదార కలిపి దగ్గరకు మరిగే వరకు ఇనుప కళాయిలో తిప్పుతారు. ఆ పాకాన్ని దించి వాటిపై ఫ్లేవర్ కోసం జీడిపప్పు, బాదం పప్పు వేస్తారు.
వేరే ప్రాంతాల్లో మాడుగుల హల్వా పేరుతో తయారు చేస్తున్నా.. వాటికి ఆ రుచికి కచ్చితంగా తేడా ఉంటుంది అన్నారు. ఎందుకంటే మాడుగుల హల్వా కోసం కనీసం 15, 20 ఏళ్లు అనుభవం ఉన్నవాళ్లే కళాయి దగ్గర పని చేస్తారు. మాడుగుల హల్వాని ఓ శతాబ్దం పాటు దంగేటి కుటుంబీకులు మాత్రమే తయారు చేసేవారు. అయితే ఈ హల్వా వ్యాపారం బాగుండటం... విదేశాల్లో సైతం క్రేజ్ రావడంతో చాలా మంది ఈ హల్వాని తయారు చేయడం ప్రారంభించారు. దీంతో క్రమంగా మాడుగులలో హల్వా తయారీ పెద్ద వ్యాపారంగా మారింది. ప్రస్తుతం హల్వా వ్యాపారాన్ని నమ్ముకుని చాలా కుటుంబాలు మాడుగులలో జీవిస్తున్నాయి.
మాడుగుల హల్వాను తినడం వల్ల లైంగిక సామర్ధ్యం పెరుగుతుందన్న నమ్మకంతోనూ దీన్ని చాలా మంది కొంటుంటారు. ఉత్తరాంధ్రలో ఎవరింట్లో శోభనం జరిగినా ఆ దంపతుల ముందు ఉండే స్వీట్లలో మాడుగుల హల్వా తప్పని సరిగా ఉంటుంది. ఫస్ట్ నైట్ కోసం ఆర్డర్లు స్పెషల్‌గా తయారు చేయించుకుంటారు. అలాగే బాలింతలకు శక్తి కోసం కూడా చాలామంది మాడుగుల హల్వాను ఇస్తారు.