రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి. పీఎం కిసాన్ యోజన (PMKY), వైఎస్ఆర్ రైతు భరోసా (YSR Raithu Bharosa) వంటి ఆర్ధిక సాయం చేసే పథకాలతో పాటు పంట బీమా పథకాలను (Crop Insurance) అందిస్తున్నాయి. ఇందులో భాగంగా రైతులు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
తాజాగా రైతులు తప్పని సరిగా ఈకేవైసీ చేయించుకోవాలని.. అది కూడా అక్టోబర్ 12లోగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హరికిరణ్ తెలిపారు. సామాజిక తనిఖీల కోసం ఈ కేవైసీ చేయించుకున్న రైతుల లిస్ట్ ని ప్రతి రైతు భరోసా కేంద్రాల్లో ఈ నెల 16 నుంచి డిస్ ప్లే బోర్డులో పెట్టనున్నట్లు హరికిరణ్ స్పష్టం చేశారు. (ప్రతీకాత్మకచిత్రం)