భైరవకోనలో క్రీస్తు శకం 9వ శతాబ్దంలో ప్రసిద్ధ శివాలయాన్ని పల్లవ రాజులు నిర్మించారు. వారు క్షేత్రంలో ఒకే కొండను తొలిచి, 8 శివాలయాలను ప్రతిష్టించారు. ఇక్కడ 108 శివలింగాలు సైతం భక్తులు దర్శించుకోవచ్చు. అంతేగాక కొండలో నుండి జాలు వారుతున్న జలపాతం మరో ప్రత్యేకత. ఈ జలపాతం లో భక్తులు స్నానమాచరించేందుకు అధిక ఆసక్తి కనబరుస్తారు. ఇలా ఎన్నో వింతలు విశేషాలు ఉన్న భైరవకోన పుణ్యక్షేత్రంలో, మరో విశేషమైన ప్రత్యేకత ఉంది. (Image credit prakasam.ap.gov.in)
ఈ శివలింగం అడుగు భాగాన, ఎన్నటికీ కాలాలతో సంబంధం లేకుండా ఇంకిపోని జలం ఉండడం విశేషం. జల లింగం అడుగు భాగాన భక్తులు చేయి తో నీటిని తీసుకొని తమపై చల్లుకుంటారు. దీనితో సర్వపాపాలు హరించి, పునీతులవుతారని భక్తుల విశ్వాసం. ఈ జల లింగం అడుగు భాగాన సుమారు 12 అడుగుల లోతులో నీరు ఉంటుందని పురావస్తు అధికారులు సైతం నిర్ధారించారు. మరి ఈ నీరు ఎన్నటికీ ఇంకి పోవడం జరగలేదని, అమృతాన్ని పోలిన తియ్యని జలాలుగా స్థానిక పూజారులు అభివర్ణిస్తారు. మరి భైరవకోన లో ఇంతటి విశిష్టత కలిగిన ఈ జలలింగాన్ని మీరు సైతం దర్శించండి. (Image credit prakasam.ap.gov.in)