గురువారం మధ్యాహం ఒంటిగంటకు గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి చేరుకున్న చిరంజీవి.. పలు అంశాలపై సీఎంతో చర్చించారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన లంచ్ మీటింగ్ తో సినిమా టికెట్ల ధరల అంశం, సినీ ఇండస్ట్రీ సమస్యలు (Tollywood Issues), ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చించారు. వీరిద్ధరి మధ్య గంటా 15 నిముషాల పాటు సాగిన సమావేశంలో ప్రధానంగా సినిమా పరిశ్రమ సమస్యలపై ప్రధానంగా చర్చించారు. అయితే త్వరలో మరోసారి టీమ్ గా వచ్చి కలుస్తానని చెనప్పారు.. అంటే సినిమా ఎపిసోడ్ ఇక్కడితో ముగియలేదు. ఇంకా ఉంది..
అయితే గతంలో సీఎంతో భేటీ కోసం చిరంజీవి చాలా ప్రయత్నాలు చేశారని టాక్ ఉంది.. ఎన్నిసార్లు అపాయింట్ మెంట్ కోరినా సీఎం స్పందించలేదని టాలీవుడ్ టాక్.. ఇక ప్రయత్నం చేయడం వేస్ట్ అని.. ఆ కోపంతోనే ఇటీవల చిరంజీవి.. తాను సినిమా ఇండస్ట్రీకి పెద్దను కానని కామెంట్లు చేశారనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు సడెన్ గా సీఎం జగనే పిలిచి మరీ చిరంజీవికి అపాయింట్ మెంట్ ఇచ్చారు.. లంచ్ కు ఆహ్వానించారు..
ముఖ్యంగా వీరిద్దరి భేటీకి మాజీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలే కారణమని పొలిటిక్ టాక్.. ఇటీవల ఓ సమావేశంలో మాట్లాడిన చంద్రబాు సంచలన వ్యాఖ్యలు చేశారు.. చిరంజీవి వల్లే తాను సీఎంను కాలేకపోయానని.2009 ప్రజారాజ్యం పెట్టకపోతే అప్పడే సీఎం అయ్యేవాడనని.. అలా అయితే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేది అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలే ఇప్పుడు సీఎం జగన్ ఆహ్వానానికి కారణమని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ - చంద్రబాబు కలిసి వచ్చే ఎన్నికల్లో పొత్తుతో పోటీ చేసే అవకాశం ఉంది. వీరికి చిరంజీవి అండ కూడా ఉంటే.. రాజకీయంగా కాస్త ఇబ్బంది తప్పవని సీఎంకు నివేదిక అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన పిలిచి మరిచి చిరంజీవికి అపాయింట్ మెంట్ ఇఛ్చారంటూ టాలీవుడ్ టాక్..