50 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారికి యూనిట్ కు రూ.1 45 వంతున ఛార్జ్ చేస్తారు. రెండు దశాబ్దాలుగా ఇందులో ఎలాటి మార్పులేదు. ఈసారి మాత్రం తప్పకుండా మార్పులుండే అవకాశముంది. ఈ కొత్త మార్పులు వచ్చే ఏడాది ఆగస్టు నుంచి అమల్లోకి వస్తాయి. కొత్త ధరల ప్రకారం యూనిట్ సరఫరా ధర రూ.6.98గా నిర్ణయించారు. (ప్రతీకాత్మకచిత్రం)
B-1 గ్రూపులో 0-100 వరకు రూ.5.85గానూ రూ.1.85 సబ్సిడీ రానుంది. B-2 101-200 యూనిట్ల వినియోగానికి రూ.0.85 సబ్సిడీ రానుంది. B-3 గ్రూపు కింద 201-300 యూనిట్ల వినియోగానికి యూనిట్ కు అదనంగా రూ.1.15 చెల్లించాల్సి ఉంటుంది. B-4 300 యూనిట్ల వినియోగానికి రూ.1.65 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మకచిత్రం)
తాము తీవ్ర నష్టాల్లో ఉన్నట్లు డిస్కమ్ లు తెలిపారి. 2021 మార్చి నాటికి రూ.28,599 కోట్ల నష్టాలున్నాయని.. అలాగే 2021 నవంబర్ నాటికి 29,536 మేర నిర్వహణ మూలధన రుణాలు ఉన్నట్లు వెల్లడించింది. సబ్సిడీ బకాయిలు రూ.9,210, ఉదయ్ పథకం కింద రూ.953 కోట్లు మొత్తం కలిపి రూ.13,560 కోట్లు ప్రభుత్వం నుంచి బకాయిలు రావాల్సి ఉందని తెలిపాయి. (ప్రతీకాత్మకచిత్రం)