Home » photogallery » andhra-pradesh »

EIGHT NURSING STUDENTS FALL ILL AFTER GETTING COVID 19 VACCINE IN TIRUPATI RUIA HOSPITAL BA

Corona Vaccine: తిరుపతిలో వ్యాక్సిన్ వేసుకున్న 8 మంది నర్సింగ్ విద్యార్థులకు అస్వస్థత

తిరుపతిలో కరోనా వ్యాక్సిన్ వేసుకున్న 8 మంది నర్సింగ్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు తొలి విడుతలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్న నేపథ్యంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో ఈ రోజు నర్సింగ్ విద్యార్ధులకు వ్యాక్సిన్ వేశారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో మొత్తం 47 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. అయితే, వారిలో 8 మంది అస్వస్థతకు గురయ్యారు.