Theppotsavam: రత్నగిరివాసుడైన సత్యదేవుడి తెప్పోత్సవం శనివారం రాత్రి కన్నుల పండువగా సాగింది. కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణస్వామికి కార్తీకమాసంలో ఏటా తెప్పోత్సవం నిర్వహిస్తారు. అదే విధంగా ఈసారి అంతే వేడుకగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు.
రత్నగిరివాసుడైన సత్యదేవుడి తెప్పోత్సవం శనివారం రాత్రి కన్నుల పండువగా సాగింది. కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణస్వామికి కార్తీకమాసంలో ఏటా తెప్పోత్సవం నిర్వహిస్తారు.
2/ 13
సత్యదేవుడితో అమ్మవార్ల ఉత్సవమూర్తులు, క్షేత్ర పాలకులైన సీతారాముల వారిని మేళతాళాల మధ్య పంపా సరోవరం వద్దకు తీసుకొచ్చారు. ఆలయంతో పాటు కొండ దిగువ వరకు విద్యుత్ లైటింగ్ అమర్చారు.
3/ 13
తెప్పోత్సవం నేపథ్యంలో ఆలయ అధికారులు పాటు దగ్గర ఉత్సవ నిర్వహణకు అవసరమైన అన్నీ ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు స్వామి, అమ్మవార్లను ప్రధాన ఆలయం నుంచి మేళతాళాల నడుమ ఘాట్‌రోడ్డు గుండా పంపా సరోవరం దగ్గరకు తీసుకొచ్చారు.
4/ 13
సర్వాంగసుందరంగా అలంకరిచిన ప్రత్యేక వేదికపై ఆశీనులను గావించి అర్చకస్వాములు తులసిదాథ్రి పూజను నిర్వహించారు. స్వామివారు విహరించే హంసవాహనాన్ని పూలు, విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
5/ 13
హంసవాహనంపై ముమ్మారుస్వామి, అమ్మవార్లను ఉంచారు. నౌకావిహారం చేసే హంసవాహనంలో కేవలం వైదిక బృందం, సాంకేతిక భద్రత సిబ్బందిని మాత్రమే అనమతించారు.
6/ 13
రాత్రి 7గంటలకు తెప్పోత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారు,స్వామివార్లను హంసవాహనంపై ఉంచి మూడుసార్లు నదిలో ఊరేగించారు. తెప్పోత్సవం ముగియగానే ఉత్సవమూర్తులను తిరిగి కొండపైకి తీసుకెళ్లారు.
7/ 13
సత్యదేవుడి తెప్పోత్సవం ముగిసిన తర్వాత పాత టోల్గేట్ దగ్గర ప్రత్యేక కౌంటర్లలో ప్రసాదం పంపిణి చేశారు. తెప్పోత్సవం కోసం 150మంది కానిస్టేబుళ్లు, గజఈతగాళ్లను భద్రత కోసం విధుల్లో ఉంచారు.
8/ 13
ప్రతి కార్తీక పౌర్ణమికి భక్తులతో కిటకిటలాడే రత్నగిరి క్షేత్రం ఈసారి కూడా భక్తులతో రద్దీగా మారింది. ముఖ్యంగా శుక్రవారం ఏకాదశి పర్వదినం సందర్భంగా వ్రత మండపాలు, క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
9/ 13
గురువారం రాత్రి నుంచే వ్రతం టికెట్లను విక్రయించగా..శుక్రవారం తెల్లవారు జామునుంచి వ్రతాలు, సర్వదర్శనాలు మొదలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే ఉదయం 10గంటల లోపు వరకు 8443వ్రతాలు జరిగాయి.
10/ 13
రత్నగిరివాసుడైన సత్యదేవుడి తెప్పోత్సవం శనివారం రాత్రి కన్నుల పండువగా సాగింది. కాకినాడ జిల్లా అన్నవరం క్షేత్రంలో సత్యనారాయణస్వామికి కార్తీకమాసంలో ఏటా తెప్పోత్సవం నిర్వహిస్తారు. అదే విధంగా ఈసారి అంతే వేడుకగా తెప్పోత్సవాన్ని నిర్వహించారు.
11/ 13
పవిత్ర కార్తీకమాసం సందర్భంగా అన్నవరం సత్యదేవుని సన్నిధిలో భక్తులకు పులిహోర, దద్దోజనం, పాలను భక్తులకు ప్రసాదంగా ఉచితంగా అందజేశారు. 24గంటల పాటు కొండపైకి రవాణా సౌకర్యం ఏర్పాటు చేశారు.
12/ 13
శుక్రవారం తరహాలోనే పౌర్ణమి కూడా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సత్రాలు, కాటేజీలను కేటాయిస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న భక్తులకు గదులు , వేడి నీళ్లను ఏర్పాటు చేశారు.
13/ 13
సత్యదేవుని సన్నిధిలో కార్తీకమాసం వ్రతం చేసుకోవడం పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. అందుకే ఈ నెలరోజులు రత్నగిరి భక్తుల దర్శనాలతో కిటకిటలాడుతూ ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వేరే రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.