గోదావరిలో ఎర్రనీరు పోటెత్తిందంటే చాలు.. నాన్ వెజిటేరియన్స్ అంతా నదీ తీరం వైపు పరుగులు తీస్తారు.. అదిరిపోయే రుచి వుండే పులస చేపల కోసం. ఇటీవల వరదలతో.. మళ్లీ పులస ప్రత్యక్షమైంది. మొన్నటి వరకూ.. తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) ముసురు ముంచెత్తి.. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. గోదావరి కనీవినీ ఉగ్రరూపం దాల్చింది.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజనీయల నుంచి సముద్ర మార్గంలో మన గోదార్లోకి వస్తుందీ పులస.. గోదావరి సముద్రంలో కలిసే చోట ఇలా ప్రవాహానికి ఎదురీదుతూ ఈదుతూ ధవళేశ్వరం వరకు వస్తాయి పులస చేపలు. ఇక్కడ ఇంకో ముచ్చట కూడా వుంది. నిజానికి సముద్రంలో వున్నప్పుడు వీటిని ఇలస అంటారు. గోదారి నీళ్లు తాకగ.. వెండి పసిడి కలగలిసిన రంగులోకి మారి ఇలస కాస్తా పులసగా మారుతుంది.