ఏపీలో సెప్టెంబర్ 15 నుంచి 21 లోపు అన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లా సెడ్, ఎడ్ సెట్లన్నీ ఒకే వారంలో నిర్వహిస్తామని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 7
ఇక అక్టోబర్ 15 నుంచి జూనియర్ కళాశాలలు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. కళాశాలలు తెరవగానే గత విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. వచ్చే నెల చివరి నాటికి పరీక్షలు పూర్తిచేస్తామన్నారు.ప్రతీకాత్మక చిత్రం)
3/ 7
ఏపీలో స్కూళ్లు తెరుచుకోవడంపై మంత్రి మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఏపీలో వచ్చే నెల 5 నుంచి ప్రభుత్వ పాఠశాలలను ప్రారంభిస్తామని చెప్పారు.ప్రతీకాత్మక చిత్రం)
4/ 7
అదే రోజు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందిస్తామని వివరించారు. పాఠశాలలు ప్రారంభమైన రోజే 43 లక్షల మంది విద్యార్థులకు విద్యా కానుక ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.ప్రతీకాత్మక చిత్రం)
5/ 7
ఇందుకోసం మొత్తం రూ.650 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించారు. ఈ అంశంపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.ప్రతీకాత్మక చిత్రం)
6/ 7
ప్రాథమిక పాఠశాల నుంచి కళాశాలల వరకు వచ్చే విద్యా సంవత్సరాన్ని నిర్ణయించినట్టు మంత్రి సురేష్ తెలిపారు.ప్రతీకాత్మక చిత్రం)
7/ 7
పాఠశాలల ప్రారంభానికి ముందే ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తామని చెప్పారు. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా ఈ బదిలీలు ఉంటాయని వివరించారు.ప్రతీకాత్మక చిత్రం)