భారతీయ రైల్వే చరిత్రలో అరుదైన మైలురాయిగా భావించే డబుల్ డెక్కర్ సర్వీసులు ఆంధ్రప్రదేశ్ లో పున: ప్రారంభంకానున్నాయి. మూడేళ్ల కిందట అట్టహాసంగా మొదలైన డబుల్ డెక్కర్ రైలు కొంతకాలానికే ఆగిపోగా, మళ్లీ ఏప్రిల్ 13 నుంచి పట్టాలెక్కనుంది. వివరాలివే..
ఇండయన్ రైల్వేస్ ఆధునీకరణలో భాగంగా దేశంలోని పలు ప్రధాన నగరాలను కలుపుతూ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ పేరుతో కేంద్రం డబుల్ డెక్క రైళ్లను ప్రవేశపెట్టడం తెలిసిందే. గత మూడేళ్లుగా దశలవారీగా సేవలను విస్తరిస్తూ వస్తున్నారు.
2/ 9
ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం-విజయవాడ నగరాల మధ్య ఉదయ్ ఎక్స్ ప్రెస్ డబుల్ డెక్కర్ రైలు సేవలు 2019 సెప్టెంబర్ లో మొదలయ్యాయి. అప్పటి రైల్వే మంత్రి సురేశ్ ప్రభు విశాఖ రైల్వే స్టేషన్ లో జెండా ఊపి సేవలు ప్రారంభించారు.
3/ 9
ఏపీలో డబుల్ డెక్కర్ రైలు సేవలు మూడేళ్ల కిందటే మొదలైనప్పటికీ కొంతకాలానికే అవి ఆగిపోయాయి. మళ్లీ ఇన్నేళ్లకు పూర్తిస్థాయిలో రైలును నడపడానికి రంగం సిద్ధమైంది. ఉదయ్ ఎక్స్ ప్రెస్ మళ్లీ ఉదయించబోతున్నది.
4/ 9
విశాఖపట్నం-విజయవాడ మధ్య డబుల్ డెక్కర్ రైలు(ఉదయ్ ఎక్స్ ప్రెస్)ను రైల్వే అధికారులు ఎట్టకేలకు పునరుద్దరించనున్నారు. ఈనెల 13 నుంచి డబుల్ డెక్కర్ సర్వీసు పున:ప్రారంభం కానున్నట్లు వెల్లడించారు.
5/ 9
ఈనెల (ఏప్రిల్) 13 నుంచి విశాఖ-విజయవాడ మధ్య వారానికి 5 రోజులపాటు డబుల్ డెక్కర్ రైలు నడపనున్నట్లు అధికారులు ప్రకటించారు. గురు, ఆదివారాల్లో తప్ప మిగతా ఐదు రోజులూ నడుపుతారు.
6/ 9
విశాఖపట్నంలో ఉదయం 5.25కు ఉదయ్ ఎక్స్ ప్రెస్ బయలుదేరుతుంది. విజయవాడలో సాయంత్రం 5.30కు బయలుదేరుతుందని రైల్వే అధికారులు చెప్పారు.
7/ 9
ఉదయ్ డబుల్ డెక్కర్ రైలులో మొత్తం 9 ఏసీ కోచ్‌లు, 2 పవర్ కార్స్ ఉంటాయి. ప్రతీ కోచ్‌లో 120 సీట్ల కెపాసిటీ ఉంటుంది. అప్పర్ డెక్‌లో 50, లోయర్‌డెక్‌లో 48, చివర్లో 22 మంది కూర్చోవచ్చు.
8/ 9
డబుల్ డెక్కర్ రైలులో మూడు కోచ్‌లల్లో డైనింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అందులో ప్రతీ కోచ్‌లో 104 ప్రయాణికులు కూర్చోవచ్చు. 5 కోచ్‌లల్లో డైనింగ్ ఫెసిలిటీ ఉండదు.
9/ 9
మెత్తని సీట్లు, కళ్లుచెదిరే ఇంటీరియర్, డిస్ప్లే స్కీన్స్, వైఫై, మాడ్యులర్ బయో టాయిలెట్స్, స్మోక్ డిటెక్షన్ అలారమ్ సిస్టమ్ ఉదయ్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేకత.