ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో కరోనా వైరస్ (Corona Virus) విజృంభిస్తోంది. పాజిటివిటీ రేటు చూస్తుండగానే 10శాతం దాటేసింది. రెండు వారాల్లో కేసుల సంఖ్య 10రెట్లు దాటేసింది. యాక్టివ్ కేసులు కూడా 20వేలు దాటేశాయి. సంక్రాంతి సీజన్ (Sankranthi Season) నేపథ్యంలో కేసుల సంఖ్య మరింత పెరుగుతుందనే అంచనాలున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని స్కూళ్లు, కాలేజీల్లో కరోనా కేసులు వెలుగు చూశాయి. సంక్రాంతి సెలవుల తర్వాత విద్యార్థులు ఇతర ఊళ్లకు వెళ్లి తిరిగి వచ్చే అవకాశముండటంతో స్కూళ్లు, కాలేజీల్లో కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముంది. దీంతో విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
ఐతే రాష్ట్రప్రభుత్వం మాత్రం విద్యాసంస్థలు కొనసాగించేందుకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాక్యినేషన్ వేగంగా సాగుతుండటం, టీనేజ్ వారికి కూడా రికార్డుస్థాయిలో వ్యాక్సిన్ వేస్తుండటంతో ప్రమాదం ఉండకపోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అన్ని తరగతులకు సిలబస్ సగమే పూర్తికావడం, పరీక్షల్లో విద్యార్థులు ఇబ్బందిపడే అవకాశముండటమే కారణంగా తెలుస్తోంది. (ప్రతీకాత్మకచిత్రం)