అల్లూరిసీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ, అడ్డతీగల మండలాలు, అనకాపల్లి జిల్లాలో నాతవరం, నర్సీపట్నం మండలాలు, కాకినాడ జిల్లాలో కోట నండూరు పల్నాడు జిల్లాలో అమరావతి మండలం, పార్వతీపురంమన్యం జిల్లాలో భామిని, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, సాలూరు మండలాలు, విజయనగరం జిల్లాలో డెంకాడ, వేపాడ, లక్కవరపుకోట మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉంది. (ప్రతీకాత్మకచిత్రం)
విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రజలకు బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని.. ఒకవేళ బయటకు వెళ్తే ఎండవేడిమికి గురికాకుండా గొడుగుల ఉపయోగించాలని, లైట్ కలర్ దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)