Regi Pandu: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి కనిపిస్తోంది. ఇప్పటికే స్కూళ్కకు సెలవులు, వర్క్ ఫ్రాం హోలు ప్రకటించడంతో.. అందుకే అప్పుడే సంక్రాంతి శోభ కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఈ పెద్ద పండుగ మొదట భోగీతోనే ప్రారంభం అవుతుంది. భోగీ రోజున ఉదయాన్ని భోగీ మంటలు వేయడం.. సాయంత్రం ఇంట్లో చిన్నపిల్లలకు భోగీ పళ్లు పోయడం ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అయితే ఈ భోగీ రోజు పోసే వాటిలో రేగు పండ్లను వాడుతారు.. ఆ రేగు పండ్లతో లాభాలు ఎన్నో తెలుసా..?
శీతాకాలంలో లభించే పండ్లలో రేగిపండు ఒకటి. ప్రస్తుతం చలికాలం కావడంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ సీజన్లో రేగిపండ్లు తినడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. రోగనిరోధకశక్తి పెంచటంలో రేగిపండ్లు బాగా దోహదపడతాయి. వీటిల్లో విటమిన్ సి, ఏ పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే ఇలా భోగీ పళ్లు పేరుతో ఆనవాయితీగా మార్చారు మన పెద్దలు.
సాధారణంగా చలికాలం వచ్చింది అంటే జలుబు, దగ్గు లాంటి సమస్యలు సహజంగా వెంటాడుతాయి. కాలంలో ఈ సమస్యల నుండి రక్షించడానికి రెగు పండ్లు ఎంతగానే సహాయపడతాయి. నిద్ర లేమి సమస్యతో బాధపడే వారు కచ్చితంగా ఈ పండ్లను తింటే నిద్ర లేమి సమస్య నుండి బయట పడొచ్చు. రేగిపండ్లను తొక్కతో పాటూ తినడం వల్ల కాలేయానికి చాలా మంచి జరుగుతుంది అంటారు.
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి రేగి తీసుకోవడం అన్ని విధాలా చాలా ఉపయోగం అంటున్నారు డెయిటీషియన్ నిపుణులు. ముఖ్యంగా మల్లబద్దకం ఉన్నవారికి రేగిపండు మరీ మంచిది అంట. శారీరిక ఆరోగ్యానికి మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యానికి కూడా రేగుపండ్లు ఉపయోగపడతాయి. రేగిపండ్లలో ఒత్తిడిని తగ్గించే గుణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా రేగుపండ్లు బెస్ట్. చర్మంపై ముగతలను పోగొట్టి, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి రేగుపండ్లు.
విరేచనాలతో బాధ పడుతున్న వారు రేగి చెట్టు బెరడును తీసి కషాయంలా చేసి తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది రేగుపండ్లను ఒక అరలీటరు నీళ్లలో వేసి అవి సగం అయ్యే వరకు మరగనివ్వాలి. దానికి పంచదార కానీ తేనె గానీ కలిపి దానిని రోజూ పడుకోబోయే ముందు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు పెరగడంలో, కండరాలకు బలాన్నివ్వడంలో రేగిపండ్లు కీలకపాత్రవహిస్తాయి. రేగు పళ్లని ఎండపెట్టి వాటితో వడియాలను, రేగుతాండ్రనూ చేసుకుని తింటారు.
అధిక బరువుతో బాధపడే వారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. రేగుపళ్లు చెడు కొవ్వును కరిగించడమే కాకుండా ఆకలిని పెంచుతాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వగల రేగు పండ్లను బలహీనంగా ఉన్న వారు తినడం చాలా మంచిది. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో కూడా రేగిపండ్లు కీలక పాత్రనే పోషిస్తాయి. రేగుపండ్లు తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. రక్తప్రసరణ సరిగ్గా జరగడం కోసం, రక్తం ఉత్పత్తిని పెంచటంలో సహాయపడతాయి.
ఎండిన రేగు పండ్లలో కాల్షియం, పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఎముకల్ని బలహీన పరిచే ఆర్థరైటిస్ సమస్యతో ఎవరైనా బాధపడుతుంటే, వారికి ఈ పండ్లు తినడం మంచిది. రేగు పండ్లు పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగివుంటాయి. ఈ చిన్న రేగు పండ్లలో ఉండే మినరల్స్ మన గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా అవసరం.