Sankranti Special: తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి.. ఆంధ్రప్రదేశ్ లో ఈ సందడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. పండుగకు పది రోజుల ముందు నుంచి హంగామా కనిపిస్తోంది. వివిధ రాష్ట్రాల్లోనూ.. విదేశాల్లోనూ ఉన్న తెలుగు వారు కూడా పండుగకు సొంతింటికి చేరుకుంటారు అది సంక్రాంతి స్పెషల్ అయితే ఈ పండుగలో పిండి వంటలు కూడా ఒక భాగం.. అయితే పండకు తప్పకుండా ప్రతి ఇంటా ఉండే పిండి వంటకం మినప సున్నుండలు..
తయారీ విధానం ఎలా అంటే..?
ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో మినప్పప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని పెట్టుకోవాలి. మినప్పప్పు చల్లారిన తర్వాత పుట్నాలతో కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మరోవైపు బెల్లాన్ని కూడా మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత బెల్లం పొడి, మినప్పప్పు-పుట్నాల పొడి.. ఈ రెండింటినీ బాగా కలుపుకోవాలి. అరచేతులకు నెయ్యి రాసుకుని మిశ్రమాన్ని ఉండలుగా కట్టుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మినప సున్నుండలు తినడానికి సిద్ధం..
మినపసున్నండల్లో ప్రధానంగా వాడే బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణవ్యవస్థను పటిష్టంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య దరిచేరకుండా జాగ్రత్త పడచ్చు. అలాగే ఇందులో శరీర ఆరోగ్యానికి కావలసిన ఖనిజాలు, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మినపసున్నులు ఆరోగ్యం పరంగా ఎంతో మేలు చేస్తాయి.