Corona Third Wave: ఆంధ్రప్రదేశ్ ను కరోనా థర్డ్ వేవ్ భయం వెంటాడుతోంది. తాజాగా నమోదైన కేసులు చేస్తుంటే పరిస్థితి ఆందోళన పెంచుతోంది. తజాాగా సంక్రాంతి ఎపెక్ట్ ఎంతమందిపై ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య దాదాపు 5 వేల మార్కుకు దగ్గరైంది. ఒకటి రెండు వారాల్లోనే ఆ మార్కు పదివేల మార్కును దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇటీవలే ఏపీలో మంత్రి, మాజీ ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (Kodali Nani)కి కరోనా బారినపడ్డారు. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండడంతో జరిపించిన కరోనా పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.
తాజాగా నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలో కరోనా కలకలం రేపింది. కలెక్టర్ చక్రధర్ బాబుతో పాటు కార్యాలయం లోని 20 మంది కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో కార్యాలయం మూసివేశారు. ఇటీవల అక్కడికి చాలామంది రావడంతో వారందన్నీ గుర్తించడం కష్టంగా మారింది.. వారిలో కొందరికి పాజిటివ్ నిర్ధారణ అయినా.. వారు మరింతమందికి వ్యాప్తి చేసే ప్రమాదం ఉంది..