తుఫాన్ నేపథ్యంలో ఏపీలోని అన్ని పోర్టులకు రెండో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగర, విశాఖ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆయా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఇదిలా ఉంటే తుఫాన్ తీరాన్ని తాకుందా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఇది క్రమంగా దిశమార్చుకుంటూ సముద్రంలోనే బలహీన పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఐతే సముద్రంలో వాతావరణం అల్లకల్లోలంగా ఉండే ఛాన్స్ ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏపీలో వేట నిషేధ సమయం కాడవడంతో మత్స్యకారులకు వెళ్లే అవకాశం లేదు. (ప్రతీకాత్మకచిత్రం)