మండు వేసవిలోనూ ఆంధ్రప్రదేశ్ ను తుఫాన్ల భయం వెంటాడుతోంది. అండమాన్ తీరంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్ గా ఏర్పడనుంది. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో ప్రభావం చూపుతుంది. ఈ తుఫాన్ తో రాష్ట్రానికి పెద్దగా ముప్పులేకపోయినా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)
దీని ఎపెక్ట్ తో అక్కడక్కడా ఓ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం అండమాన్ తీరానికి సమీపంలో కేంద్రకృతమైన అల్పపీడనం.. తీవ్రఅల్పపీడనంగా మారి మరో తుఫాన్ గా రూపాంతరం చెందుతోంది. కార్ నికోబార్ పోర్ట్ బ్లెయిర్ యొక్క 80 కిమీ ESE యొక్క 250 కిమీ NNE దూరంలో ఉత్తర అండమాన్ సముద్రం మీద అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది ఉత్తరదిశగా పయనిస్తూ మరింత బలపడుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. (ప్రతీకాత్మకచిత్రం)
కాగా ఈ తుఫాన్ కు ఆసానీ అనే పేరు పెట్టనున్నారు. శ్రీలంక ప్రభుత్వం ఈ తుఫాన్ కు నామకరణం చేసింది. సింహళీ భాషలో కోపాన్ని ఆసానీ అంటారు. ఈ తుఫాన్ కారణంగా తీవ్రప్రభావం ఉండకపోవచ్చని భారత వాతావరణ శాఖ చెబుతోంది. తుఫాన్ వల్ల తీరం వెంబడి గంటకు 70-90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విచే అవకాశమున్నట్లు వెల్లడించింది. (ప్రతీకాత్మకచిత్రం)