తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే అవకాశముండటంతో 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. ఈ రెండు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)
ఇక బుధ, గురువారాల్లో కృష్ణా, విజయవాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతుంది. అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తిరుపతి, కడప, అన్నమయ్య, నెల్లూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. (ప్రతీకాత్మకచిత్రం)