P. Anand Mohan, Visakhapatnam, News18. Corona Third Wave Alert:విశాఖ జిల్లాను కరోనా భయపెడుతోంది. ఓ వైపు ఒమిక్రాన్.. మరోవైపు సాధారణ కరోనా కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయనే టెన్షన్ నెలకొంది. మొన్నటి వరకు ఏపీ వ్యాప్తంగా 100 కేసులకు అటు ఇటుగా నమోదు అయ్యేవి.. కానీ ఇప్పుడు ఒక్క విశాఖ జిల్లాల్లోనే కేసుల సంఖ్య రెండు వదలకు చేరువ అవుతోంది.
విశాఖ జిల్లా వ్యాప్తంగా కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతోంది వరుసగా రెండో రోజైన శనివారం గరిష్ఠ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అయితే దీనికి ప్రధాన కారణం నగరంలో ప్రజల రాకపోకలు అధికమయ్యాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో.. విశాఖ జిల్లా చుట్టుపక్కల గ్రామాలు, ఇతర జిల్లాల నుంచి భారీగా షాపింగ్ కోసం విశాఖ వస్తున్నారు.
దీనికి తోడు విశాఖకు విదేశీ ప్రయాణికులు భారీగా చేరుకుంటున్నారు. కొందరికి ఎయిర్ పోర్టులోనే పాజిటివ్ నిర్ధారణ అయినా.. అక్కడ నెగిటివ్ వచ్చిన వారికి కూడా.. తరువాత ఇళ్లకు చేరుకున్న పాజిటివ్ వస్తున్నట్టు సమారం. దీంతోనే సామాజిక వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. అయినా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విదేశీ ప్రయాణికులు వారం రోజుల పాటు క్వారంటైన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక షాపింగ్ మాల్స్.. పెద్ద పెద్ద షోరూంలతో పాటు.. దుఖాణాల సముదాయాల్లో జనం రద్దీ ఎక్కువగా ఉంటోంది. అలాంటి ప్రాంతాల్లోనూ కొందరు మాస్కులు ధరించడం లేదు.. కొందరు మొక్కుబడిగా మెడకు నోటికి మాస్కులు వేసుకుంటున్నారు. ముక్కు పై వరకు పెట్టుకోవడం లేదు.. ఇలాంటి నిర్లక్ష్యం కూడా.. కరోనాకేసులు పెరగడానికి ప్రధాన కారణం అవుతోంది.
గతంతో పోలిస్తే ఈ సారి కోలుకొనే వారి సంఖ్య స్వల్పంగా ఉంటోంది. దీంతో పెందుర్తి సుజాతనగర్లోని ‘ఏ జోన్’ ఉద్యానవనాన్ని కొవిడ్ నేపథ్యంల ముసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ లోనూ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇకపై నుంచి ఇంటి నుంచే పని ప్రారంభిస్తున్నారు. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్న దివ్యాంగులు, గర్భిణులకు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) సౌకర్యం కల్పిస్తున్నట్టు ఉక్కు యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 31వ తేదీ వరకు కొత్త విధానం అమలులో ఉంటుందని, ఉద్యోగులు ఫోన్కు అందుబాటులో ఉంటూ, హెడ్ క్వార్టర్లోనే ఉండాలని యాజమాన్యం స్పష్టం చేసింది.
గతంతో పోలిస్తే ఈ సారి కోలుకొనే వారి సంఖ్య స్వల్పంగా ఉంటోంది. దీంతో పెందుర్తి సుజాతనగర్లోని ‘ఏ జోన్’ ఉద్యానవనాన్ని కొవిడ్ నేపథ్యంల ముసివేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ లోనూ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్న దివ్యాంగులు, గర్భిణులకు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోమ్) సౌకర్యం కల్పిస్తున్నట్టు ఉక్కు యాజమాన్యం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజాగా విశాఖలోని ఎలమంచిలి మండలం కొక్కిరాపల్లి గురకుల పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ దంపతులకు కరోనా పాజిటివ్ రావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే గురుకుల పాఠశాలలో సుమారు 570 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి కరోనా నిర్ధారణ అయిన తరువాత గురుకుల పాఠశాలకు కరోనా సెలవులు ఇచ్చారు. దీంతో ఎంతమంది విద్యార్థులకు కరోనా సోకింది అన్నది గుర్తించడం కష్టమే.