Corona Terror: ఆంధ్రప్రదేశ్ ను కరోనా మళ్లీ భయపెడుతోంది. ఊహించని స్థాయిలో కేసులు రెట్టింపు అవుతున్నాయి. ఇప్పటికే రోజు వారి కేసుల సంఖ్య ఆరు వేల మార్కును దాటింది. ఒకటి రెండు రోజుల్లోనే ఆ మార్కు పదివేలను క్రాస్ చేసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. తాజాగా నెల్లూరులోని శ్రీహరికోట షార్ కేంద్రంలో కరోనా కలవరపెట్టింది.