Lock down: ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోజు రోజుకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా రెండు జిల్లాల్లో పరిస్థితి తీవ్ర ఆందోళన పెంచుతోంది. మొన్నటి వరకు వందలోపే ఉన్న కేసులు.. ఇప్పుడు వేయి మార్కుకు చేరువ అవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే ఆ రెండు జిల్లాల్లో లాక్ డౌన్ తప్పదనే భయం పెరుగుతోంది. ఇప్పటికే కఠిన ఆంక్షలు దిశగా అధికారలు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
విశాఖ జిల్లాలో కేసులు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటి ఎయిర్ నుంచి విదేశీ ప్రయాణాలు ప్రారంభం కావడమే.. విదేశాల నుంచి భారీగా విశాఖకు ప్రయాణికులు వస్తున్నారు. అందులో కొంతమందికి టెస్టుల్లో నెగిటివ్ చూపిస్తే.. వారు క్వారంటైన్ లో ఉండడాని ఇష్ట పడడం లేదు. మరికొంతమంది తప్పుడు అడ్రస్ ఇచ్చి ఉంటున్నారు. ఇలాంటి వారితో కేసులు పెరిగే ప్రమాదం ఉంది.
ఇక చిత్తూరు జిల్లాలో భారీగా కేసులు పెరుగుతున్నాయి అంటే.. అందులో సగానికపైగా తిరుపతిలో సోకినవే ఉంటాయి.. తిరుమలకు నిత్యం వేలాది మంది భక్తులు భారీగా ఇతర ప్రాంతాల నుంచి చేరుకుంటారు.. ఆలయ ప్రాంగణంలో ఎన్ని కఠిన నిబంధనలు అమలు చేసినా.. బయటన మాత్రం భారీగా జనం గుమిగూడుతున్నారు. ఈ నేపథ్యంలో కేసులు భారీగా పెరిగి ప్రమాదం ఉంటుంది..