AP Corona: ఏపీలో మళ్లీ సెలవులు.. ఒకే స్కూళ్లో 20 మందికి కరోనా.. విద్యార్థుల్లో భయం భయం
AP Corona: ఏపీలో మళ్లీ సెలవులు.. ఒకే స్కూళ్లో 20 మందికి కరోనా.. విద్యార్థుల్లో భయం భయం
Andhra Pradesh Corona: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ స్కూళ్లకు సెలవులు తప్పావా..? తాజా పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఒకే రోజు ఒకే స్కూళ్లో 20మందికి కరోనా నిర్ధారణ అవ్వడం కలకలం రేపుతోంది..
corona cases in andhra pradesh Schools: ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులను కరోనా మళ్లీ భయ పెడుతోంది. దీంతో థర్డ్ వేవ్ మొదలైందా అని టెన్షన్ పెరుగుతోంది. ఇటీవల చాలా స్కూళ్లను కరోనా సెగ తాకుతోంది..
2/ 11
తాజాగా జిల్లాలోని కొత్త వలస మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఎంతలా అంటే ఒకే అదే స్కూళ్లో 20 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అందులో 19 మంది విద్యార్థులు, ఒక ఇంగ్లీష్ ఉపాధ్యాయుడికు కరోనా సోకింది..
3/ 11
పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారందరినీ వెంటనే ఐసోలేషన్ కు తరిలించారు. వారిలో కొందరిలో లక్షణాలు కనిపించగా.. కొందరిలో మాత్రం ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. అయితే ముందు జాగ్రత్తతో అందరికీ మెరుగైన వైద్యం అందిస్తున్నారు.
4/ 11
ఒకేసారి 20 మందికి కరోనా సోకడంతో ఆ స్కూళ్లో చదువున్న ఉపాధ్యాయులు, అద్యాపకులు అంతా ఆందోళనకు గురయ్యారు.. వారితో కాంట్రాక్ట్ లో ఉన్న వారందరికీ మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.
5/ 11
ఒకే రోజు 20 మందికి కరోనా సోకడంతో అధికారులు, అధ్యాపకులు అలర్ట్ అయ్యారు.. స్కూళ్లు మొత్తాన్ని.. చుట్టుపక్కల ప్రాంతాలను పూర్తిగా శానిటైజ్ చేయించారు. అలాగే స్కూలుకు రెండు రోజుల వపాటు సెలవు ప్రకటించారు మండల విద్యా శాఖ అధికారి శ్రీదేవి.
6/ 11
ఇటీవల ఏపీ వ్యాప్తంగా స్కూళ్లలో కరోనా కేసులు వస్తుండడం ఆందోళన పెంచుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ స్కూళ్లకు సెలవులు ప్రకటించాల్సి వస్తుంది. ముఖ్యంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోపోతే ప్రమాదం తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
7/ 11
ప్రస్తుతం ఏపీలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వరకు యువతి, యువకులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో కోరనా కేసులు పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది. ఇక 15 ఏళ్ల లోపు విద్యార్థుల తల్లిదండ్రులను భయం వెంటాడుతోంది.
8/ 11
ఇప్పటికే ఏపీలో థర్డ్ వేవ్ మొదలైందనే భయం పెరుగుతోంది. ఓ వైపు కేసులు పెరుగుతున్నాయి.. మరోవైపు రోజు వారి కేసుల సంఖ్య పెరుగుతూవస్తున్నాయి.
9/ 11
నిన్న నెల్లూరులో షార్ లో ఒకే రోజు 12 మందికి కరోనా నిర్ధారణ కాగా.. ఇవాళ విజయనగరం జిల్లాల్లోనూ ఒకే స్కూళ్లో 20 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది.
10/ 11
నిన్నటి వరకు వందకు అటు ఇటుగా ఏపీలో కేసులు నమోదు అయ్యావి.. కానీ గత 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా 300లకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది.
11/ 11
ముఖ్యంగా విశాఖ జిల్లాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే విశాఖలో ఒకే రోజు కరోనా కేసుల సంఖ్య 80 నమోదు కావడం ఆందోళన పెంచుతోంది.