Corona Alert In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో ప్ర్తస్తుతం కరోనా కేసుల సంఖ్య చూస్తుంటే.. రాష్ట్రంలో కరోనా మూడో దశ ముప్పు ముంచుకొస్తోందనే సంకేతాలు అందుతున్నాయి. ఎందుకంటే రోజురోజుకూ కొవిడ్ కేసులు ఊహించని విధంగా పెరుగుతున్నాయి. అయితే వీటిల్లో అత్యధికం ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందినవేనని తెలుస్తోంది.
ఇటీవల విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన కొవిడ్ బాధితులతో పాటు ర్యాండమ్‌గా స్థానికుల నుంచి సేకరించి పంపిన సుమారు వంద నమూనాలను హైదరాబాద్‌లోని సీసీఎంబీలో పరీక్షించగా 80% వరకు ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందినవిగా తేలిందని సమాచారం. మొదటిలో మనకు కేసులు వేరేగా.. సాధారణ కరోనా వేరేగా లెక్కలు విడుదల చేసేవారు.. కానీ ఇప్పుడు అన్నింటినీ కలిపి రోజు వారి కరోసా కేసులుగా బులిటెన్ విడుదల చేస్తున్నారు.
ఇప్పటికే పండగ కోసం ప్రజలు భారీగా సొంత ఇళ్లకు వస్తుండడంతో.. సంక్రాంతి తరువాత నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు ప్రకటిచింది. అయితే ఇది ప్రజలను వస్తున్న డిమాండ్ ద్వారా తీసుకున్నదే అయినా.. నష్టం తప్పకపోవచ్చు.. ఎందుకంటే భారీగా జనం బస్సులు, ట్రైన్లు, ఇతర వాహనాల ద్వారా వస్తున్నారు. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రజలు భారీగా బారులు తీరుతున్నారు. దీంతో కరోనా సామాజిక వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి..
అక్కడి నుంచి నేరుగా వారు గ్రామాలకు వస్తున్నారు. ఇక సంక్రాంతి పేరుతో బంధువులు అంతా ఒక చోటే చేరుతారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా చిన్ననాటి స్నేహిుతులు, గ్రామస్తులను నేరుగా కలుస్తారు.. ఇక ఊళ్లో ఉన్నప్పుడు మాస్కులు ఎందుకులే అని అంతా లైట్ తీసుకుంటారు.. ఇవన్నీ కరోనా సమాజిక వ్యాప్తిని మరింత పెంచే ప్రమాదం ఉంది.
కరోనా వేరియంట్లలో డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావం తక్కువగానే ఉంది అని తేలికగా తీసుకోవద్దు అంటున్నారు వైద్య నిపుణులు. రెండో దశలో విజృంభించిన డెల్టా వేరియంట్ వైరస్ బాధితుల ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయింది. శ్వాసకోశ సంబంధ సమస్యలు తీవ్రమై కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సి వచ్చింది. దగ్గు, జలుబు, విరేచనాలు, వాసన, రుచి తెలియకపోవడం వంటి లక్షణాలు బయటపడ్డాయి. చాలామందికి రెమ్‌డెసివిర్, టొసిలిజుమాబ్, ఇతర స్టిరాయిడ్లు వినియోగించారు. 14 రోజుల వరకు హోం ఐసొలేషన్‌లో ఉన్నారు.
ఆయాసం, ఆక్సిజన్ స్థాయులు పడిపోవడం వంటి సమస్యలు దాదాపుగా లేవని వైద్యులు చెబుతున్నారు. డెల్టాతో పోల్చితే ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం తగ్గిందంటున్నారు. న్నారు. అయితే ఇది కేసుల సంఖ్య పెరిగే కొద్ది మరింత ప్రభావం అయ్యే ప్రమదం ఉందని.. అందుకే పండుగల పేరుతో నిబంధనలకు తూట్ల పొడవద్దని.. అందరూ వ్యక్తిగతంగా కరోనా నిబంధనలు పాటించాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు..
ముఖ్యంగా పండుగకు అంతమందితో కలిసి కాస్త దూరం మెయింటెన్ చేయాలి.. సొంత ఊరిలో .. ఆఖరికి ఇంట్లో అందరి మధ్య ఉంటే మాస్క్ తప్పని సరిగా పెట్టుకోవాలి.. ముఖ్యంగా షేక్ హ్యాండ్ కు బైబై చెప్పి.. మన సంప్రదాయ నమేస్తేకు ఓటేయాలి అంటున్నారు. అలాగే ఎప్పటి కప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నవారి ఒంటరిగా.. అందరికీ దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు.