కరోనా (Corona Virus) మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దాదాపు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తైనా వైరస్ మాత్రం ఇంకా వణికిస్తూనే ఉంది. కొంతకాలంగా ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడం, మాస్కును గాలికి వదిలేయడంతో కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. చాపకింద నీరులా కరోనా విజృంభిస్తోంది. ఇందులో కొన్ని వేరియంట్లు కూడా నమోదవుతున్నాయి. (ప్రతీకాత్మకచిత్రం)
ఇటీవల కరోనా టెస్టులు తగ్గడం, ప్రజల్లో మనకేమవుతుందిలే అనే ఉదాశీనత పెరగడం కూడా కేసులు ఎక్కువగా నమోదవడానికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం నమోదయ్యే కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్లు కూడా ఉంటున్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వచ్చేది సీజనల్ జ్వరమా లేక కరోనా అనేది కూడా తేల్చుకోలేకపోతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో తాజా కరోనా కేసులు పరిశీలిస్తే.. గత 24గంటల్లో రాష్ట్రంలో 96 కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2,901 యాక్టివ్ కేసులున్నాయి. గత 24గంటల్లో 419 మంది కోలుకోగా.. ఇప్పటివరకు 23,11,032 మంది కరోనాను జయించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 14,733 మంది మరణించారు. (ప్రతీకాత్మకచిత్రం)
ప్రస్తుతం నమోదయ్యే కేసుల్లో ఎక్కువగా ఒమిక్రాన్ కేసులే ఉంటున్నాయి. ఐతే గతంలో కరోనా వేరియంట్ల నిర్ధారణకు శాంపిల్స్ ను పూణే లేదా హైదరాబాద్ పంపాల్సి వచ్చేది. ఇప్పుడు విజయవాడ, గుంటూరులోనే ప్రత్యేక ల్యాబ్ లు ఏర్పాటు చేయడంతో సమస్య తీరింది. తాజాగా గుంటూరు ల్యాబ్ లో 135 శాంపిల్స్ పరీక్షగా వాటికో ఎక్కువగా ఒమిక్రాన్ వేరియంట్ లోని Bi1, b2m b3 సబ్ వేరియంట్లు ఉన్నట్లు గుర్తించారు. (ప్రతీకాత్మకచిత్రం)
ఐతే ఒమిక్రాన్ వేరియంట్ కేవలం గొంతు, ముక్కు వరకే పరిమితమవుతోందని.. ఊపిరితిత్తుల వరకు వెళ్లడం లేదని డాక్టర్లు చెబుతున్నారు. దీని వల్ల కొద్దిగా జ్వరం ఒళ్లునొప్పులు తలనొప్పి నీరసం గొంతులో అడ్డుపడినట్లు అనిపించటం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయంటున్నారు. ప్రస్తుతం ఒమిక్రాన్ b2 వేరియంట్ కేసులు మాత్రమే వస్తున్నాయంటున్నారు. (ప్రతీకాత్మకచిత్రం)