హైకోర్టు న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యల కేసులో మరో 44 మందికి నోటీసులు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వారిలో వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు, మరో జర్నలిస్ట్ ప్రసాదరెడ్డి పేర్లు కూడా ఆ జాబితాలో ఉన్నాయి. ఇదే కేసులో రెండ్రోజుల క్రితం హైకోర్టు 49 మందికి నోటీసులు జారీ చేసింది. దీంతో మెత్తం 93 మందికి ఇప్పటి వరకు నోటీసుల జారీ అయ్యాయి. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత కోర్టు మీద సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.